'ఆర్ఆర్ఆర్'పై సుకుమార్ పోస్ట్.. మీకూ మాకు అదే తేడా అంటూ..

by Javid Pasha |   ( Updated:2022-03-26 02:23:09.0  )
ఆర్ఆర్ఆర్పై సుకుమార్ పోస్ట్.. మీకూ మాకు అదే తేడా అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్‌ 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా 'పుష్ప' రికార్డులు చేసింది. కానీ మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ 'ఆర్ఆర్ఆర్' విడుదలైన మొదటి రోజే 'పుష్ప' రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం రాజమౌళి పేరు ప్రతిధ్వనిస్తుంది. తాజాగా సుకుమార్ 'ఆర్ఆర్ఆర్' సినిమాపై స్పందించాడు. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సుకుమార్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీకు మాకు అదే తేడా అంటూ సుకుమార్ పోస్ట్ పెట్టాడు.

అయితే రాజమౌళి, సుకుమార్ ఇద్దరికీ ఒకరంటే మరొకరి ఎనలేని గౌరవం. ఒకరి ప్రతిభను మరొకరు ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటారు. కానీ 'ఆర్ఆర్ఆర్' సినిమా మాత్రం రాజమౌళిపై సుకుమార్‌కు ఉన్న గౌరవాన్ని మరింత అధికం చేసింది. ఇంతకీ 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి సుక్కు ఏమన్నాడంటే.. 'మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి, మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి- రాజమౌళి సార్. మీకూ మాకు ఒకటే తేడా.. ఇలాంటి సినిమాలు మీరు తీయగలరు మేం చూడగలం అంతే' అంటూ సుకుమార్ రాసుకొచ్చాడు.

దీనికి తెలుగు ప్రేక్షకులు అంగీకరిస్తూ రాజమౌళి ఇంతకన్నా పెద్ద, గొప్ప, విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తాడని, బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టడమే రాజమౌళికి తెలుసు అని కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed