బంగారం కోసం భార్యతో గొడవ.. ఆ తర్వాత ఊరి బయట చెట్టుకు..

by Disha News Desk |
బంగారం కోసం భార్యతో గొడవ.. ఆ తర్వాత ఊరి బయట చెట్టుకు..
X

దిశ, మక్తల్: కూతురు నామకరణ రోజు భార్య భర్తలు బంగారం కోసం గొడవ పడి కురువ మల్లప్ప(24) అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందాపూర్ గ్రామంలో జరిగింది. సోమవారం రాత్రి కూతురు నామకరణం లో ఉషారుగా బంధువులతో కలిసి గడిపారు. కానీ తెల్లవారే సరికి చెట్టుకి ఉరి వేసుకుని వేలాడుతున్న దృశ్యం అటు గ్రామస్తులను, ఇటు బందువులను కలిచి వేసింది. కుటుంబీకుల కథనం ప్రకారం ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న మల్లప్ప కు రెండు సంవత్సరాల కిందట మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి సందర్భంగా ఇచ్చిన మూడు తులాల బంగారు విషయంలో అత్త, మామ, భార్య మల్లప్ప తో గొడవ పడ్డారు. దీంతో తెల్లవారుజామున మూడు గంటల సమయాన బయట పని ఉందని వెళ్ళాడు. బహిర్భూమి దగ్గర ఉన్న చెట్టుకు తన షర్టు తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన గురించి మక్తల్ పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం బాడిని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు మక్తల్ ఎస్సై రాములు తెలిపారు.

Advertisement

Next Story