- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యుద్ధాన్ని వెంటనే ఆపాలి.. నిరసన తెలిపిన విద్యార్థులు
దిశ ప్రతినిధి, సిద్దిపేట: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని తునికి ఖల్సా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు అన్నారు. గత ఐదు రోజులుగా రష్యా దేశం ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి ఖల్సా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్లకార్డ్స్ పట్టుకొని యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధం వద్దు ప్రపంచ శాంతి ముద్దు, ప్రపంచ శాంతి వర్థిల్లాలి, " ఇండియా వాంట్స్ టూ పీస్, స్టాప్ ది వార్ అనే నినాదాలు చేస్తూ వినూత్న రీతిలో వెనుకకు నడుస్తూ గ్రామమంతా ర్యాలీ నిర్వహించారు.
అనంతరం హెచ్ఎం నాగరాజు మాట్లాడుతూ.. ప్రపంచమంతా గత రెండు సంవత్సరాలుగా కరోనాపై యుద్ధం చేసి మెల్లమెల్లగా కోలుకుంటుందని, ఇటువంటి సమయంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు రష్యా దేశం ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ యుద్ధం కారణంగా సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతారని, దీని కారణంగా జరిగే ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని వెలకట్టలేమని ఆయన అన్నారు. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా చనిపోయే ప్రమాదం ఉండదని చెప్పారు.
ఎంత పెద్ద సమస్యైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, యుద్ధం వల్ల కేవలం ఆ రెండు దేశాలేకాక ఇతర ప్రపంచ దేశాలు కూడా నష్టపోతాయని, ఈ రెండు దేశాల మధ్య ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం వహించి యుద్ధ నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా వారు అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పులి రాజు, విమల, శిరీష, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.