- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బట్టలు కొనుక్కోవడానికి వెళ్లిన యువతి.. రైలు పట్టాలపై..
దిశ, షాద్ నగర్ : గురుకులంలో చదువుతున్న విద్యార్థిని బట్టలు కొనుక్కుంటానని ఇంటి నుంచి వెళ్లింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట రైల్వే గేట్ సమీపంలోని రైలు పట్టాలపై అనుమానాస్పద రీతిలో బాలిక గాయత్రి మృతదేహం లభించింది. రైల్వే పట్టాలపై మంగళవారం ఉదయం ముక్కలైన గాయత్రి శవాన్ని స్థానికులు కనుగొన్నారు. అనంతరం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి గ్రామానికి చెందిన గాయత్రి షాద్ నగర్ పరిధిలోని కమ్మదనం గురుకుల వసతి గృహంలో పదో తరగతి చదువుతుంది. ఆదివారం తల్లిదండ్రులతో కలిసి కల్వకుర్తి ట్రైబల్ వెల్ఫేర్‌లో జూనియర్ కళాశాలకు సంబంధించిన పరీక్షలు రాయడానికి వెళ్ళింది. అనంతరం తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లి పోయింది. సోమవారం సోదరుడితో కలిసి అమ్రాబాద్‌లో బట్టలు తెచ్చుకుంటానని వెళ్ళింది. సోదరుడిని బస్టాండ్ దగ్గర వదిలి గాయత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తీరా మంగళవారం ఉదయం రైలుపట్టాలపై శవమై తేలింది. చనిపోయే కొద్ది క్షణాల ముందు పట్టాలపై తిరుగుతున్న గాయత్రిని గ్యాంగ్ మెన్ తిరుపతి పట్టాలపై తిరుగొద్దని హెచ్చరించారు. ఆ తర్వాత తిరుపతి కొద్దిదూరం వెళ్ళగానే అటుగా వస్తున్న చెన్నై ఎగ్మోర్ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. గాయత్రి అస్సలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటో తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.