- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ గ్రాఫ్ పేకమేడలా కూలింది: ప్రొఫెసర్ కోదండరాం
దిశ ప్రతినిధి, సంగారెడ్డి/సంగారెడ్డి: పూర్తిగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గ్రాఫ్పేకమేడలా కూలిపోయింది. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలిన ఆయన కుటుంబ సంక్షేమం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. తన రాజకీయ పరపతి కోల్పోవడంతోనే దిక్కులేని స్థితిలో పీకే(ప్రశాంత్‌కిషోర్)ను తెచ్చుకున్నాడు. ఇక్కడే ఏం చేయలేని కేసీఆర్ డిల్లీలో ఏం చేస్తాడని తెలంగాణ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్కోదండరాం ఘాటుగా విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో పార్టీ రెండవ ప్లీనరీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఇంట వెలవనోడు, రచ్చ గెలుస్తాడా..? ఇక్కడే గెలిచే పరిస్థితులు లేక పీకేను తెచ్చుకున్నడు. ఆయన ఢిల్లీకి పోయి ఏంచేస్తడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ఏం కోరుకుంటున్నాడో వెల్లడించాలి. అంతే కానీ నయా దిశ, నయా సమ్మిదాన్అంటూ ఢిల్లీలో తిరిగితే అయితదా..? అని ప్రశ్నించారు. ఏడేండ్లు బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థించి ఇప్పుడు ఏదో మాట్లాడితే ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఢిల్లీ రాజకీయాలు కేసీఆర్‌నుంచి అయ్యే పని కాదు, ఆయన నుంచి సాధ్యం కూడా కాదన్నారు. ఎన్నో ఫ్రంట్‌లు వచ్చాయి, వీగిపోయాయి, ఎన్నో చూశాం. అప్పటి పరిస్థితులు లేవు. అందుకే బీజేపీ ప్రభుత్వంపై నిరసన తెలిపే శక్తి కూడా కేసీఆర్‌కు లేదని కోదండరాం విమర్శించారు.
ప్రాజెక్టుల పేరుతో కోట్లు సంపాదించుకున్నారు..
కోట్లాది రూపాయాల ప్రాజెక్ట్ లకు వచ్చించి అందులో కోట్లు సంపాదించుకున్నారని కోదండరాం ఆరోపించారు. తెలంగాణలో ప్రస్తుతం స్వంత భూమి కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తహశీల్దార్లకు ప్రభుత్వం భూములు గుర్తించే పనులు అప్పగించారు. అలా గుర్తించి భూములను తెగనమ్ముతున్నారు. ఆ వచ్చిన డబ్బులను 70 శాతం ప్రాజెక్టుల పేరుతో సివిల్కాంట్రాక్టులకు వెచ్చిస్తున్నారు. అందులోంచి తలా ఇంత పంచుకుంటున్నారని కోదండరాం సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిన ఆయన తమ కుటుంబ సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని విమర్శించారు. తమ స్వంత భూములు కోల్పోయిన రైతులు వాటి కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పరాయి వాళ్లం అయ్యామని, ఎవడో కుర్చీ వేసుకొని కూర్చుంటే ఎలా భరిస్తామని హెచ్చరించారు. ఉద్యోగాలు రాక, ఇతర మార్గం లేక తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తెలంగాణ జన సమితి ఊరుకోదన్నారు. దోపిడీ, ఆత్మహత్యలు లేని తెలంగాణ మా స్వప్నం అని అందుకు కోసం ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని కోదండరాం చెప్పారు.
రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపడతాం..
అవినీతి, అక్రమాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ క్రమంలోనే రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు నడుంకట్టాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ఉద్యమానికి సిద్ధం అయ్యాం. ప్రజా సమస్యలపై చేయగలిగే పోరాటాన్ని మరింత ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లే దమ్ము, ధైర్యం, శక్తి మాకున్నది. తప్పకుండా ముందుకు తీసుకువెళతాం. భవిష్యత్తు ఎజెండాను నిర్థారిస్తామని కోదండరాం ప్రకటించారు. తెలంగాణ ఆకాంక్షకు తూట్లు పొడిచిన పాలనను అంతమొందించడానికి కృషి చేస్తున్నాం. ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ జెండాలకు అతీతంగా సంపూర్ణ సహకారం అందించాలని కోదండరాం చేతులు జోడించి అభ్యర్థించారు. మా ఉద్యమంతో మార్పుకు శ్రీకారం చుడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి జరగాలన్నదే మా లక్ష్యం అందుకోసం ముందుకు సాగుతున్నాం. ఈ సందర్భంగా ప్లీనరీ వేదికగా ప్రొఫెసర్కోదండరాం స్వయంగా రాసిన 'ఏడేండ్ల కథ ఏమిటి..?, 'ఎవడి పాలైందిరో తెలంగాణ.?' అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తుల్జా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు, గంగాపురం వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, బద్రుద్దీన్,రాజ మల్లన్న, ఉపకారి శంకర్రావు, పైడి రమేష్, లక్ష్మి, మమత, డీపీ రెడ్డి వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో టీజేఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.