కాబోయే భార్యపై స్టార్ హీరో కీలక వ్యాఖ్యలు..

by Manoj |
కాబోయే భార్యపై స్టార్ హీరో కీలక వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: యాక్షన్ హీరో విశాల్‌ తెలుగు, తమిళ భాషల్లో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎప్పుడూ విభిన్నమైన సినిమాలతో అలరిస్తుంటాడు. విశాల్‌ హీరోగానే కాకుండా నిర్మాతగా పలు మంచి సినిమాలను తెరకెక్కించాడు. ఇటీవల యాక్షన్ సీన్స్లో డూప్ లేకుండా చేసిన నేపథ్యంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశ్రాంతి తీసుకుంటున్న విశాల్.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు.

' పెద్దలు కుదిర్చిన సంబంధాలు తనకు అచ్చిరావని, కాబట్టి లవ్‌ మ్యారేజే చేసుకుంటానని చెప్పాడు. అంతేకాదు, ప్రస్తుతం ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే ఆమె ఎవరనే విషయాన్ని బయటపెడ్తానని' పేర్కొన్నాడు. మరి ఆమె ఎవరనేది తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే! ఇకపోతే విశాల్‌కు 2019లో నటి అనీషా అల్లారెడ్డితో నిశ్చితార్థం జరిగింది. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకునేలోపు వారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed