Sreeleela: వారణాసిలో శ్రీలీల పూజలు.. వైరలవుతోన్న పిక్స్..!!

by Anjali |   ( Updated:2024-11-23 09:17:52.0  )
Sreeleela: వారణాసిలో శ్రీలీల పూజలు.. వైరలవుతోన్న పిక్స్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: కుర్ర హీరోయిన్ శ్రీలీల(Sreeleela).. టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి ఏ ముహూర్తాన అడుగు పెట్టిందో తెలియదు కానీ ఓ ఊపు ఊపిందని చెప్పుకోవచ్చు. ఏకంగా అగ్ర హీరోల సరసన నటించి అతితక్కువ సమయంలోనే స్టార్ నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. తన అందం, అభినయం, అదిరిపోయే డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిందనడంలో అతిశయోక్తిలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) హీరోగా నటిస్తోన్న పుష్ప-2 (Pushpa-2) లో ఐటెమ్ సాంగ్ కు స్టెప్పులేస్తుంది. ఇప్పటికే స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో మేకర్స్ విడుదల చేయగా.. గ్లామర్ స్టెప్పులతో శ్రీలీల నెటిజన్లను ఆకట్టుకుంది. ఇకపోతే రేపు (నవంబరు 24) కిస్సిక్ అంటూ కొనసాగే ఫుల్ సాంగ్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో క్వీన్ శ్రీలీల తల్లి స్వర్ణలతతో కలిసి వారణాసి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించింది. కిస్సిక్ సాంగ్ మంచి హిట్ కావాలని అక్కడి ప్రార్థనలు చేసి పవిత్ర గంగా ఘాట్ ను దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Read More..

Pushpa 2 : ‘పుష్ప2’ నుంచి ‘కిస్సిక్’ సాంగ్ ప్రొమోను రిలీజ్ చేసిన మేకర్స్

Advertisement

Next Story