అప్‌కమింగ్ పాడ్‌కాస్టర్స్‌కు స్పోటిఫై సాయం!

by Nagaya |
అప్‌కమింగ్ పాడ్‌కాస్టర్స్‌కు స్పోటిఫై సాయం!
X

దిశ, ఫీచర్స్ : స్వీడిష్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పోటిఫై భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న పాడ్‌కాస్టర్స్‌ను ఎలివేట్ చేసేందుకు తాజాగా ఓ కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇది ఆయా పాడ్‌కాస్టర్స్‌కు తమ ప్రేక్షకులను పెంచుకునేందుకు తగిన మద్దతునిస్తుంది.

ఇండియాతో పాటు 15 ప్రపంచ మార్కెట్లలో 'రాడార్ పాడ్‌కాస్టర్స్' కార్యక్రమాన్ని స్పోటిఫై ప్రారంభించింది. అదనంగా పాడ్‌కాస్టర్స్ ప్రారంభ స్లేట్‌ను కూడా ప్రకటించగా, అది RADAR ప్రోగ్రామ్‌తో గుర్తించబడుతుంది. ఇండియా నుంచి తొలిగా 'అనురాగ్ మైనస్ వర్మ, చుమ్మా కన్వర్జేషన్ విత్ సత్య, గెట్టింగ్ లాస్ట్ విత్ అర్చిత్ అండ్ షిరిన్‌ : ఆల్ అబౌట్ ఫుడ్' వంటి పేర్లతో షో హోస్ట్ చేస్తున్న ముగ్గురు పాడ్‌కాస్టర్స్‌ను స్లేట్‌లో భాగం చేశారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా పాడ్‌కాస్టింగ్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా క్రియేటర్స్‌ను హైలెట్ చేయనున్నామని స్పోటిఫై పేర్కొంది. ఈ మేరకు ప్రతీ త్రైమాసికంలో తమ పాడ్‌కాస్ట్ బృందం తమ ప్లాట్‌ఫామ్‌లోని ముగ్గురు అప్-కమింగ్ క్రియేటర్స్‌ను ఎంపిక చేయనుంది.

స్పోటిఫై.. ఇండియాలో ప్రతీ మూడు నెలలకు ఒక స్థానిక భాషపై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలో మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌ పరంగా దేశవ్యాప్తంగా స్పోటిఫైలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషల్లో ఒకటైన తమిళంపై ఈసారి దృష్టి కేంద్రీకరించనుందని స్పోటిఫై పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed