- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సీఎం చీకటి పల్లెలలో వెలుగులు నింపాడంటున్న.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
దిశ, కోటగిరి: చీకటి పల్లెలను వెలుగు పల్లెలుగా మార్చి, రాజకీయ రంగానికి నూతన ఒరవడిక సృష్టించిన నాయకులు మన సీఎం కేసీఆర్ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పరిధిలోని యాధ్గార్పూర్, వల్లభాపూర్ గ్రామాలలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరచని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు పరిచిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో గోదావరి జలాలను నిజం సాగర్ లో నింపుకొని, రైతులు రెండు పంటలు పుష్కలంగా పండించుకోవచ్చన్నారు. తద్వారా బాన్సువాడ నియోజకవర్గంలో సుమారు 95 వేల ఎకరాలకు భవిష్యత్ లో సాగునీరు కొరత ఉండదన్నారు. ఏప్రిల్ మాసంలో కొత్త పింఛన్లు మంజూరు కావడం జరుగుతుందని తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా యాధ్గార్పూర్, వల్లభాపూర్ గ్రామాల సర్పంచులు, ప్రజలు.. గ్రామాలకు సంబంధించిన పలు డిమాండ్లను స్పీకర్ దృష్టికి తీసుకురాగా వాటినన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాధ్గార్పూర్, వల్లభాపూర్ గ్రామాల సర్పంచులు విజయ సాయన్న, శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ వల్లేపల్లి సునితా శ్రీనివాస్, జెడ్పీటీసీ శంకర్ పటేల్, ఆర్.డీ.వో రాజేశ్వర్, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు సిరజ్, ఎంపీటీసీ ఫారుక్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావణ్య అరవింద్, మండల తెరాస పార్టీ అధ్యక్షులు ఎజాస్ ఖాన్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొల్లూరు కిశోర్, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.