ప్రధాని అఖిలపక్ష భేటీ! హాజరైన అగ్రనేతలు

by Harish |
ప్రధాని అఖిలపక్ష భేటీ! హాజరైన అగ్రనేతలు
X

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలు ఒక రోజు ముందుగానే ముగిసిన నేపథ్యంలో ప్రధాని మోడీ.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా తో పాటు ఇతర పార్టీల నేతలతో సమావేశమయ్యారు. లోక్‌సభ వాయిదా పడిన తర్వాత, అన్ని పార్టీలు సమిష్టిగా చర్చలకు తావివ్వాలని విపక్ష నేతలను కోరినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2023లో శాసనమండలి సమావేశాలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చే ఆలోచనలు ఉన్నట్లు బిర్లా తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారం వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

Next Story