- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హత్యల వెనుక పెద్ద విషయమే ఉంది.. సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా: బెంగాల్ సముహా హత్యలపై ప్రతిపక్ష బీజేపీ రాజకీయ హింస, అన్యాయాన్ని అనుమతించిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ హత్యల వెనుక ఏదో పెద్ద విషయమే దాగి ఉందని ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం సంఘటన జరిగిన గ్రామమైన బిర్భూంలో ఆమె పర్యటించారు. 'ఆధునిక బెంగాల్‌లో ఇలాంటి అనాగరికం జరుగుతుందని నేను ఎప్పుడూ నమ్మలేదు. తల్లులు, పిల్లలు చంపబడ్డారు. మీ కుటుంబ సభ్యులు మరణించారు. నాకు తీవ్ర ఆవేదన ఉంది అని బాధితుల కుటుంబాలను ఆమె ఓదార్చారు. ఈ చర్యలకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని అన్నారు. ఎలాంటి సాకులు ఉండకూడదని తెలిపారు. బాధ్యులను అరెస్ట్ చేయాలని చెప్పారు. సాక్ష్యులకు పోలీస్ బందోబస్త్ కల్పిస్తామని అన్నారు. అంతేకాకుండా తగలబడిన ఇళ్లను మరమ్మతులు చేసేందుకు రూ.2లక్షల ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మృతులు కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మంగళవారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తిగత కక్షలతో 8 మందిని సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే.