- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్మార్ట్ గ్లోవ్స్.. చాలా యూజ్‌ఫుల్
దిశ, ఫీచర్స్: ఆపరేషన్ థియేటర్లలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు శస్త్రచికిత్స సమయంలో ప్రతీ వైద్యుడు తప్పనిసరిగా హ్యాండ్ గ్లోవ్స్ ధరిస్తుంటారని తెలిసిన విషయమే. అయితే ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం సెన్సార్లతో కూడిన స్మార్ట్ సర్జికల్ గ్లోవ్స్ తయారుచేయగా, క్లిష్టమైన శస్త్రచికిత్సా విధానాలను అంచనా వేయడంలో ట్రైనీ సర్జన్స్‌కు ఇవి ఉపయోగపడతాయి.
శతాబ్ద కాలంలో శస్త్రచికిత్సా పద్ధతులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. అయితే శస్త్రచికిత్స శిక్షణ ఇప్పటికీ పరిశీలనపై ఆధారపడి ఉండగా, సర్జన్లు చూసి నేర్చుకోవడంలో కాస్త తడబాటు ప్రదర్శించొచ్చు. ఈ క్రమంలోనే కొత్తగా అభివృద్ధి చేసినా సర్జికల్స్ గ్లోవ్స్ వారికి ఈ విషయంలో ఉపయోగకరంగా ఉండనున్నాయి. ఈ మేరకు స్మార్ట్ గ్లోవ్స్ శిక్షకులకు ప్రత్యామ్నాయం కాకపోయినా ట్రైనీ సర్జన్స్‌కు సలహాలు అందించడంలో తోడ్పడుతాయి. అయితే స్మార్ట్ సర్జికల్ గ్లోవ్స్ పనివిధానాన్ని తెలుసుకునేందుకు, శస్త్రచికిత్సా నైపుణ్యాల అవసరాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి.. లివర్‌పూల్ హాస్పిటల్‌లోని ట్రైనీ సర్జన్స్ ఈ ప్రోటోటైప్‌పై ట్రయల్ రన్ నిర్వహించారు. దీని ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా స్మార్ట్ గ్లోవ్స్‌లో మార్పులు చేయనున్నారు. అయితే ముందుగా శస్త్రచికిత్స సమయంలో అనుభవజ్ఞులైన సర్జన్‌ల చేతి కదలికల డేటాను స్మార్ట్ గ్లోవ్స్‌లో రికార్డ్ చేస్తారు. ఆపై, వీటిని ట్రైనీలు ధరించినప్పుడు, డేటా కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది. ఈ మేరకు యంగ్ సర్జన్స్ వారి చేతి కదలికలు తమ సీనియర్ వైద్యుల నుంచి ఎక్కడ భిన్నంగా ఉన్నాయో చెక్ చేసుకుని, తప్పులు సవరించుకునే అవకాశముంటుంది. కాగా స్మార్ట్ గ్లోవ్స్ ఈ ఏడాది చివరలో మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.
ఎలా పనిచేస్తుందంటే..?
ప్రతీ స్మార్ట్ గ్లోవ్స్ చివరలో మెజర్‌మెంట్ యూనిట్స్ ఉండగా, అవి చేతుల కదలికల డేటాను సేకరించి ప్రతి గ్లోవ్ వెనుక అమర్చిన చిన్న ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌లోకి డంప్ చేయబడతాయి. దాని నుంచి బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్‌కు చేరుతుంది.