Abhishek Reddy: నేడు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు.. హాజరుకానున్న జగన్ దంపతులు

by Shiva |
Abhishek Reddy: నేడు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు.. హాజరుకానున్న జగన్ దంపతులు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి (YS Jaganmohan Reddy) సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి (YS Abhishek Reddy) శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయనL మృతితో వైసీపీ ముఖ్య నాయకులు, కార్యాకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ మేరకు ఇప్పటికే అభిషేక్‌ రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్‌ నుంచి పులివెందులకు తీసుకెళ్తున్నారు. సాయంత్రం ఆయన అంతిమ‌‌యాత్రను ప్రారంభం కానుంది. అంత్యక్రియలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతి (Bharathi) పాల్గొననున్నారు. కాగా, పార్టీలకు అతీతంగా నాయకులు అభిషేక్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి, ఇతర ఎమ్మె‌ల్యేలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Next Story

Most Viewed