ఇంటర్ ఫలితాల్లో వాసవి కళాశాల ప్రభంజనం

by Sumithra |   ( Updated:2025-04-23 05:46:11.0  )
ఇంటర్ ఫలితాల్లో వాసవి కళాశాల ప్రభంజనం
X

దిశ, ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో తమదైన శైలితో విద్యాసంస్థలను రాణిస్తున్న వాసవి కళాశాల యాజమాన్యం ఇంటర్​ ఫలితాల్లో ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంది. నగరానికి కూతవేటు దూరమైన ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో సాధారణ స్థాయిలో విద్యాసంస్థ నడిపిస్తూ కార్పొరేట్​ విద్యనందిస్తున్న కళాశాల వాసవి అని ప్రచారం సాగుతుంది. పెద్ద పెద్ద కార్పొరేట్​ స్థాయిలో లక్షలు పెట్టి నడిపిస్తున్న విద్యాసంస్థలతో పోటీ పడుతూ.. విద్యార్థులకు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యనందిస్తుంది వాసవి కాలేజీ. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్​ ఫలితాల్లో వాసవి జూనియర్​ కళాశాల రాష్ట్రంలోనే టాప్​ టెన్​ ర్యాంకులను సాధించింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో స్టేట్​ 3వ, 5వ ర్యాంకులను కైవసం చేసుకోగా, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో స్టేట్​ పదవ ర్యాంకులను, ఓకేషనల్​ మొదటి సంవత్సరంలో టాప్​ వన్​ ర్యాంకులను సాధించి ప్రభంజనం సృష్టించింది.


కళాశాల ఫలితాలు ఇలా..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని వాసవి రెసిడెన్షియల్ ఇంటర్ అండ్ ఒకేషనల్ కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. అంతే కాకుండా స్టేట్ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. వరంగల్ కు చెందిన తేజస్విని ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి స్టేట్ 3వ ర్యాంక్ లో నిలిచారు. నాగర్​ కర్నూల్​ జిల్లా చారగొండ మండల కేంద్రానికి చెందిన వరలక్ష్మి ఎంపీసీలో 470 మార్కులకు గాను 464 మార్కులతో స్టేట్ 5వ ర్యాంక్ సాధించింది. అదే విధంగా ఇంటర్​ మొదటి సంవత్సరంలో వాసవి కళాశాలకు చెందిన 62 మంది విద్యార్థులు 400లకుపైగా మార్కులు సాధించారు. చింతపల్లి మండలం గోడుకొండ్ల గ్రామానికి చెందిన అనూష ఇంటర్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ ఎంఎల్టీలో 500 మార్కులకు గాను 489 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. అలాగే ఒకేషనల్లో 162 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో 400పైన మార్కులు సాధించి ఉత్తీర్ణత దక్కించుకున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కందుకూరు మండలం బేగంపేట్ గ్రామానికి చెందిన మణికంఠ సీఈసీలో 1000 మార్కులకు గాను 967 మార్కులు సాధించి టాప్​ టెన్​ స్థానంలో నిలిచారు. ఇబ్రహీంపట్నంకు చెందిన సత్య ప్రసన్నకు 1000 మార్కులకు 950 మార్కులతో (ఎమ్ పి హెచ్ డబ్ల్యూ) గ్రూప్ రెండవ స్థానంలో నిలువగా, శ్రీజ 946/1000 మార్కులతో (ఎమ్ పి హెచ్ డబ్ల్యూ) గ్రూప్ మూడవ స్థానం సాధించింది. ఈ ర్యాంకుల పంటలతో వాసవి కళాశాలలో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది. స్వీట్స్​, బాణాసంచాలతో సంబురాలను జరుపుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు.


చైర్మన్​ మాదారం రమేష్​ కృషితోనే సాధ్యం...

అతి తక్కువ కాలంలో వాసవి కళాశాల పేరు ప్రభంజనంగా మారిపోవడానికి కారణం చైర్మన్​ మాదారం రమేష్​ అని విద్యార్థులు వివరిస్తున్నారు. ప్రత్యేకమైన శ్రద్దతో విద్యాబోధన, క్రీడలు, మౌలిక వసతులు కల్పిస్తూ నిబంధనలకు అనుగుణంగా కాలేజీ నడిపించడంలో రమేష్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూర్​ మండలం బేగంపేట​ గ్రామానికి చెందిన మాదారం రమేష్​ గౌడ్​ అతి సాధారణ కుటుంబం నుంచి ఎడ్యుకేషనల్​ స్థాపనకు చేరుకున్నారు. పట్టుదలతో విద్యార్థులను విజ్క్షాన వంతులను చేయాలనే ఆకాంక్షతో ఆయన ప్రయాణం ప్రారంభమై... నేడు కార్పొరేట్​ శక్తులతో పోటీ పడి ప్రభంజనం సాధించారు. విద్యతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి ఏడాది కళాశాలల్లో వివిధ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారు. 2024-25 సంవత్సరంలో వాసవి రెసిడెన్షియల్ ఇంటర్ అండ్ ఒకేషనల్ కళాశాల ఇబ్రహీంపట్నం నుంచి రాష్ట్ర వాలీబాల్ అండర్ -16 లో స్టేట్ 1 వ ర్యాంకుతో పాటు గోల్డ్ మెడల్ ను అందుకొని, పలువురు ప్రశంసలు పొందిన గుర్తింపు వాసవి కాళాశాలకు ఉంది.






Next Story

Most Viewed