ఇది పుల్వామా కంటే పెద్ద దాడే.. అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-04-23 05:24:42.0  )
ఇది పుల్వామా కంటే పెద్ద దాడే.. అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహెల్గాం‌లో జరిగిన ఉగ్రమూకల (Terror Attack) దాడిపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి స్పందించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పర్యటన కోసం వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం ఉన్మాదపు చర్య అని ఫైర్ అయ్యారు. ఇది ముమ్మాటికీ పుల్వామా ఘటన కంటే పెద్ద దాడి అని అన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందని.. ఇప్పటికైనా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టాలని కోరారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. దేశంలో మళ్లీ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు.



Next Story
null