- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరదలు మనసును అర్థం చేసుకోని బావ.. విషం తాగిన ఆరుగురు అమ్మాయిలు
దిశ, వెబెడెస్క్ : ప్రేమ ఎక్కడ ఎవరితో ఎలా మొదలవుతుందో తెలియదు. అలా ఓ అమ్మాయి తన బావను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయింది. ఇక తాను లేకపోతే జీవితమే లేదు అన్నంతగా ప్రేమలో మునిగిపోయింది. కానీ తన బావకు మాత్రం తన ప్రేమను తెలపలేక పోయింది. నా బావే కదా.. నన్నే చేసుకుంటాడు అనుకుందేమో.. ఎప్పుడూ తన స్నేహితులకు తన ప్రేమ గురించి చెబుతూ సంతోషపడేది. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు.. స్నేహితులతో కలిసి తన ప్రేమను తెలుపడానికి వెళ్లిన అమ్మాయి ఆశ నిరాశ అయ్యింది. చివరికి తనకు తన స్నేహితులకు చావే శరణ్యంగా మారింది.
సంఘటన వివరాల్లోకి వెళ్లితే.. ఔరంగాబాద్ జిల్లా కస్మా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరాయిల గ్రామానికి చెందిన ఓ అమ్మాయి తన బావతో ప్రేమలో పడింది. అదే విషయాన్ని తన బావతో చెప్పి ప్రపోజల్ పెట్టి పెళ్లికి ఒప్పించాలని ఎంతో ఆశగా గురువారం తన ఐదుగురు స్నేహితులతో కలిసి బావ దగ్గరుకు వెళ్లి, తన ప్రేమను తెలిపింది. కానీ అతను ఆమె ప్రేమను ఒప్పుకోలేదు.. అంతే కాకుండా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను పెళ్లి చేసుకోలేను అని ఖరాఖండిగా చెప్పాడు. అలాగే నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను.. తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఆ అమ్మాయి తట్టుకోలేక పోయింది. వెంటనే ఇంటికి వెళ్లి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తన స్నేహితులు ఇక్కసారిగా షాక్ అయ్యారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఐదుగురు విషం తాగారు. దీంతో ఈ సంఘటనను తెలుసుకున్న స్థానికులు వెంటనే అంబులెన్స్ కాల్ చేసి అందరిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనలో ముగ్గురు అమ్మాయిలు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆరుగురు అమ్మాయిలు విషం తాగి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోగా, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు