పుట్టినరోజున చావు గురించి మాట్లాడిన సింగర్..

by Manoj |   ( Updated:2022-07-07 09:51:06.0  )
పుట్టినరోజున చావు గురించి మాట్లాడిన సింగర్..
X

దిశ, సినిమా: ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ 49వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్ మీరట్‌లో జన్మించిన ఆయన.. తన సంగీత ప్రయాణం గురించి వివరిస్తూనే, సూసైడ్ అటెంప్ట్ చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. మొండి వైఖరితో తన 21వ ఏట ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపాడు. చుట్టూ ఉన్న వ్యక్తులు తనను అర్థం చేసుకోవడం లేదని.. తిరస్కరణలు, అవమానాలు, అణిచివేతలు ఎదుర్కొంటున్నానని గంగా నదిలో దూకేసినట్లు చెప్పుకొచ్చాడు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు కాపాడటంతో.. చావులోనూ ఫెయిల్యూర్ ఎదుర్కొనట్లు తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed