చంపాపేట్‌లో సింగర్ ఆత్మహత్య

by Mahesh |
చంపాపేట్‌లో సింగర్ ఆత్మహత్య
X

దిశ, తిరుమలగిరి (సాగర్) : నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం పిల్లిగుండ్ల తండ కు చెందిన సింగర్ జటావత్ మోహన్ (24) చంపాపేట్ లోని తన గదిలో మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు హైదరాబాదులోని ఉస్మానియా హాస్పిటల్ లో పోస్ట్ మార్టం నిర్వహించి.. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అందించినట్లు సమాచారం. యూట్యూబ్ లో మోహన్ పాడిన పలు బంజారా పాటలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మోహన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed