- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నగల మెరుపు తగ్గకుండా ఉండాలా..? ఈ సింపుల్ టెక్నిక్స్ పాటించండి!
దిశ, ఫీచర్స్: బంగారం అంటే ఇష్టపడిని వారు ఎవ్వరూ ఉండరు. ప్రతీ ఒక్కరు ఇష్టపడే విలువైన లోహం బంగారం. ముఖ్యంగా ఆడవాళ్లకి బంగారం అంటే చాలా ఇష్టం. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారంను కొనుగోలు చేస్తుంటారు. అయితే, దీనిని కొన్నప్పుడు ఉన్నంత మెరుపు కొంత కాలం తరువాత తగ్గినట్లు కనిపిస్తుంటుంది. కానీ, బంగారంకు ఎన్ని సంవత్సరాలు అయినా మెరుపు తగ్గకుండా ఉండాలంటే ఈ చిన్న టెక్నిక్‌ను పాటించండి.
బంగారం అనేది మెత్తని లోహం. చాలా మంది బంగారు ఆభరణాలన్నింటినీ కలిపి ఒకే పెట్టెలో పెట్టడం చేస్తుంటారు. అలా పెట్టడం వల్ల ఆభరణాలు ఒకదానికొకటి చిక్కుపడతాయి. అలా ఎప్పుడూ చేయకూడదని నిపుణులు సూచించారు. ఆభరణాలను సక్రమంగా పెట్టకపోవడం వల్ల దాని మీద గీతలు పడడం లేదా విరిగిపోవడం జరుగుతుంది. అందువల్ల నగలను విడివిడిగా నగలపెట్టెలో పెట్టడం మంచిది.
* బంగారు ఆభరణాలను ఎప్పటికప్పుడు మెత్తని వస్త్రాన్ని ఉపయోగించి శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
* కొందరు ఆభరణాలను నగలకు ఇచ్చిన పెట్టెలో కాకుండా, వాళ్లకి నచ్చిన మంచి డిజైన్ ఉన్న పెట్టెలో పెడుతుంటారు. అలా చేయడం వల్ల బంగారం దాని మెరుపు కోల్పోతుంది. అందువల్ల వీటికి ప్రత్యేకంగా కేటాయించిన నగల పెట్టెలను లేదా మెత్తని వస్త్రం ఉన్న పెట్టెలను ఉపయోగించాలి.
* తేమ అనేది బంగారం మెరుపును తగ్గేలా చేస్తుంది. చాలామంది చైన్లు, గాజులు, ఉంగరాలు వంటి వాటిని ధరించి స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల నగలకు సబ్బు పట్టి వాటి మెరుపును కోల్పోతాయి. అందుకే స్నానం చేసే సమయంలో నగలను పక్కన పెట్టడం మంచిది.
* బంగారు నగలు తేమకు గురైతే వాటి మెరుపును కోల్పోతుంటాయి. మెరుపు తగ్గకుండా ఉండాలంటే, వాటిని తేమలేని సిలికా జెల్ ప్యాకెట్‌లో నిల్వ ఉంచడం మంచిది. ఇలా స్టోర్ చేస్తే, అదనపు తేమను కూడా తొలగించడంలో ఇది సహాయపడుతుంది.
* ఫంక్షన్లకు వెళ్లే ముందు నగలు వేసుకున్న తరువాత మేకప్ చేసుకోకూడదు. హెయిర్ స్ప్రే, పెర్‌ఫ్యూమ్ వంటివి వాడిన తరువాతే ఆభరాణాలు ధరించాలి. లేకుంటే ఆ స్ప్రే కారణంగా ఆ నగలు వాటి సహజ మెరుపును కోల్పోయే అవకాశం ఉంటుంది.