పంజాబ్ కేబినెట్ 11 మంది మంత్రులలో 9 మంది కోటిశ్వరులే..

by Mahesh |
పంజాబ్ కేబినెట్ 11 మంది మంత్రులలో 9 మంది కోటిశ్వరులే..
X

చండీగఢ్: పంజాబ్ నూతన మంత్రివర్గం విషయంలో పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సంచలన విషయాలు వెల్లడించింది. నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన 11 మంది మంత్రుల్లో ఏడుగురు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని సోమవారం తెలిపింది. అంతేకాకుండా వీరిలో నలుగురిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇక 11 మందిలో 9 మంది కోటీశ్వరులు కాగా, సగటు ఆస్తులు రూ.2.87 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. ఇక మంత్రుల్లో జింపా నియోజకవర్గం నుంచి గెలుపొందిన బ్రమ్ శంకర్ రూ.8.56 కోట్లతో అత్యధిక ఆస్తులు కలిగి ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే కుల్తార్ సింగ్ సాన్ ద్వాన్ 16వ పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకున్నారు. సీఎం భగవంత్ మాన్ ఈ ప్రతిపాదనను ముందు తీసుకొచ్చారు.

రాజ్యసభకు భజ్జీ తో నలుగురు!

పంజాబ్ రాజ్యసభ స్థానానికి ఐదుగురు అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు ఆప్ ప్రకటించింది. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ఐఐటీ ప్రొఫెసర్ సందీప్ పతాక్, విద్యావేత్త అశోక్ కుమార్ మిట్టల్, ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాలు పార్టీ నుంచి ఎగువసభకు ప్రతిపాదించినట్లు పేర్కొంది. కాగా వచ్చే 9తో ఐదు స్థానాలు ఖాళీ కానుండగా, ఈ నెల 31 ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed