- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంప్రమైజ్ కాకుంటే ఇండస్ట్రీలో నిలబడలేం.. సీనియర్ నటి
దిశ, సినిమా : సీనియర్ నటి జయసుధ తన 50 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు చూశానని చెప్పింది. అలాగే అప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌పై వివక్ష కొనసాగుతున్నట్లు అంగీకరించింది. తాజాగా ఇందుకు సంబంధించిన అనేక విషయాలను మీడియాతో పంచుకుంది. 'ఈ పరిశ్రమలోకి వచ్చి యాభై ఏళ్లు పూర్తయింది. ఇండస్ట్రీలో మహిళలను గౌరవించే విషయంలో గొప్ప మార్పులేం జరగలేదు. హీరోలు, పురుషులకు మాత్రం చాలా మర్యాదలు జరుగుతున్నాయి. స్టార్ హీరోయిన్స్‌పైనా వివక్ష ఉంటుంది. నేను బలమైన డిమాండ్లతో ఉంటే ఇన్నేళ్లు ఇక్కడ రాణించేదాన్ని కాదు. అన్నింటికీ కాంప్రమైజ్ అవుతూనే ఇంత దూరం ప్రయాణం చేశా' అని వివరించింది. అదే ముంబై నుంచి వచ్చే హీరోయిన్లను ఒకలా ట్రీట్ చేస్తారన్న ఆమె.. వాళ్ల కుక్క పిల్లలకు కూడా ఒక రూమ్ ఇచ్చి రాచమర్యాదలు చేస్తారని, మనవాళ్లను మాత్రం చులకనగా చూస్తారని షాకింగ్ కామెంట్స్ చేసింది. చివరగా ఎవరెవరో కాంట్రవర్సీలు చేసేవాళ్లకు 'పద్మ శ్రీ' ఇచ్చారంటూ నటి 'కంగన' పేరు ప్రస్తావించడం విశేషం.