అంతరిక్షంలోకి ఆ ఫొటోలు పంపనున్న శాస్త్రవేత్తలు.. ఏలియన్స్ కోసమే..

by Javid Pasha |
అంతరిక్షంలోకి ఆ ఫొటోలు పంపనున్న శాస్త్రవేత్తలు.. ఏలియన్స్ కోసమే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏలియన్స్ అనేది ఎప్పటికీ హాట్ టాపిక్‌గా ఉంటుంది. అవి ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు నానా తంటాలు పడుతున్నారు. గ్రహాంతర వాసులు నిజంగా ఉంటే అవి ఎలా ఉంటాయి? అవి మనకన్నా అత్యాధునిక జీవితం గడుపుతున్నాయా? అవి ఏ గ్రహం నుంచి వచ్చాయి? ఇలా లక్షల ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే గ్రహాంతర వాసులు దొరకాలి. వాటికోసం చేస్తున్న అన్వేషణలో శాస్త్రవేత్తలు తాజాగా ఓ వింత పని చేశారు. ఏలియన్స్ కోసమని శాస్త్రవేత్తలు కొన్ని ఫొటోలను స్పేస్‌లో పంపనున్నారు. ఒక పురుషుడు, ఒక స్త్రీ నగ్నంగా ఉన్న డిజిటలైజ్‌డ్ ఫొటోను పంపనున్నారు. దీనికి సంబందంచిన బైనరీ కోడింగ్ ఇమేజ్‌ను అంతరిక్షంలోకి లేజర్‌ల ద్వారా ప్రసారం చేయనున్నారు. అంతేకాకుండా దీంతో పాటుగా దీనికి రెస్పాండ్ అయ్యేవారికి స్వాగతం పలికేలా ఓ మెసేజ్ కూడా ఉందని సైంటిస్టులు తెలిపారు. మరి ఈ ఫొటోను చూసి పాలపుంతలో ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో చూడాలి.



Advertisement

Next Story