గుండె చప్పుడు వినగలిగే బట్టలు.. శాస్త్రవేత్తల కొత్త సృష్టి

by samatah |
గుండె చప్పుడు వినగలిగే బట్టలు.. శాస్త్రవేత్తల కొత్త సృష్టి
X

దిశ, ఫీచర్స్ : గుండె చప్పుడును వినగలిగే క్లాతింగ్ ఫైబర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది ధ్వనిశాస్త్రంలో విప్లవానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కొత్త సాంకేతికత భవనాలలో పగుళ్లతో పాటు అంతరిక్ష నౌకలో పేరుకుపోయిన అంతరిక్ష ధూళిని కూడా గుర్తించగలదు. ఈ మేరకు ఛాతి ప్రాంతంలో చొక్కా ఇన్నర్ లైనింగ్‌కు సింగిల్ ఫైబర్‌ను అల్లిన యూఎస్ పరిశోధకులు.. ఆరోగ్యవంతుడైన వ్యక్తి హృదయ స్పందనలను 'లబ్-డబ్' వంటి సూక్ష్మ వైవిధ్యాలతో సహా కచ్చితంగా గుర్తించిందని స్పష్టం చేశారు. ఇక గర్భిణులు తమ బిడ్డ హృదయ స్పందనను తెలుసుకునేందుకు కూడా ఈ క్లాత్‌ను యూజ్ చేయొచ్చు.

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ (RISD) పరిశోధకుల సహకారంతో ఈ ఫాబ్రిక్ రూపొందించబడింది. ఇది మైక్రోఫోన్ పనితీరుకు సమానంగా.. ధ్వనిని మెకానికల్ వైబ్రేషన్స్‌గా మార్చిన తర్వాత మన చెవుల మాదిరే వాటిని విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. మానవ కర్ణభేరి నుంచి ప్రేరణ పొందిన పరిశోధకులు ధ్వనిని గుర్తించగల ఈ ఫాబ్రిక్ 'చెవి'ని రూపొందించారు. కాగా ఇందులోని కర్ణభేరిని ఫైబర్స్‌తో తయారు చేశారని మెటీరియల్ సైంటిస్ట్ యొయేల్ ఫింక్ చెప్పారు. ఫ్యాబ్రిక్‌లో అమర్చిన ఫైబర్‌లోని 'పైజోఎలక్ట్రిక్' మెటీరియల్.. వంగినప్పుడు విద్యుత్ సిగ్నల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది శబ్దాల నుంచి విద్యుత్ సంకేతాలను సృష్టించడానికి ఫాబ్రిక్‌ను అనుమతిస్తుంది.

ఈ ఫాబ్రిక్.. మానవ చర్మంతో అస్పష్టంగా ఇంటర్‌ఫేస్ చేయగలదు. దీన్ని ధరించేవారు వారి గుండె, శ్వాసకోశ స్థితిని సౌకర్యవంతంగా దీర్ఘకాలిక పద్ధతిలో పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. ఇక అతిసూక్ష్మ వైబ్రేషన్స్‌ను గుర్తించగల ఈ ఫైబర్ వినికిడి పరికరంగానూ పని చేస్తుంది కాబట్టి వినికిడి లోపం ఉన్నవారిలో కార్డియాక్ మానిటరింగ్‌ను పర్‌ఫెక్ట్‌గా చేపట్టగలదు. శబ్ద దిశను కచ్చితంగా పసిగట్టడమే ఇందుకు కారణం. సముద్రంలో చేపల జాడను తెలుసుకునేందుకు స్మార్ట్ నెట్స్‌లో కూడా ఈ ఫైబర్‌ను అల్లవచ్చు.

Advertisement

Next Story