రూల్స్ బ్రేక్ చేసిన SBI.. రూ.1.90 లక్షలు ఫైన్ వేసిన జీహెచ్‌ఎంసీ

by GSrikanth |   ( Updated:2022-03-08 10:20:42.0  )
రూల్స్ బ్రేక్ చేసిన SBI.. రూ.1.90 లక్షలు ఫైన్ వేసిన జీహెచ్‌ఎంసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. ప్రభుత్వ కార్యాలయమైనప్పటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. దుకాణ సముదాయాలు, థియేటర్లు, హాస్పిటల్స్‌ బిల్డింగ్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్లు ఏర్పాటు చేయడం నేరం. అలాంటి వారిని గుర్తించి జీహెచ్ఎంసీ అధికారులు భారీగా ఫైన్లు విధిస్తుంటారు. ఈ క్రమంలో నగరంలో రద్దీగా ఉండే అబిడ్స్ ప్రాంతంలోని ఎస్బీఐ బ్యాంకు అధికారులు దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిబంధనలను ఉల్లంఘించింది. ఇది గమనించిన సామాజికవేత్త విజయ్ గోపాల్.. ఫొటోలు తీసి ఈవీడీఎం అధికారులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినట్లు గుర్తించిన ఈవీడీఎం అధికారులు.. మూడింటికి రూ.20వేల చొప్పున, ఒక ఫ్లెక్సీకి రూ.30 వేలు, మరో ఫ్లెక్సీకి రూ.1 లక్ష జరిమానా విధిస్తూ చలాన్లను రిలీజ్ చేసింది. దీంతో మొత్తం రూ.1.90 లక్షల ఫైన్లను ఈవీడీఎం అధికారులు ఎస్బీఐ బ్యాంకు యాజమాన్యంపై వేశారు.

Advertisement

Next Story