- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు ఊస్ట్.. భర్తలతో కలిసి ఆ పని చేశారనే..
దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లను వారి పదవుల నుంచి తొలగించారు. గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై మండల స్థాయి అధికారులు విచారణ చేపట్టి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో సర్పంచ్ భూక్యా శ్రావణితోపాటు ఆమె భర్త శివకృష్ణ, ఉప సర్పంచ్ యడమకంటి ఝాన్సీ లక్ష్మీతోపాటు ఆమె భర్త శివారెడ్డి పేరు మీద 116 చెక్కుల రూపంలో రూ.1,27,08,324 రూపాయల పంచాయతీ నిధులు డ్రా చేసి తమ ఖాతాలో జమ చేసుకున్నారు.
ఈ విషయంలో గత ఆరు నెలల క్రితం అధికార పార్టీ నాయకులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆ నివేదికను జిల్లా అధికారులకు సమర్పించారు. దీంతో నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ భూక్యా శ్రావణి, ఉప సర్పంచ్ యడమకంటి ఝాన్సీ లక్ష్మీలను పదవుల నుంచి తొలగిస్తూ ఈ నెల 22వ తేదీన ఉత్తర్వులు జారీచేశారు. కాగా అట్టి ఉత్తర్వులను జిల్లా అధికారులతో పాటు మండల అధికారులు బయటకు రాకుండా గోప్యంగా ఉంచారు. దీన్ని బట్టి ఈ నిధుల దుర్వినియోగంపై ఎవరి పాత్ర ఎంత ఉందో అర్థం అవుతుంది.
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన గ్రామ సర్పంచ్ అధికార పార్టీలో చేరేందుకు ఫిర్యాదు చేసిన అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో జతకట్టారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నాగినేనిప్రోలు రెడ్డి పాలెం గ్రామంలో భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేను కొంతమంది ప్రశ్నిస్తే వారిని ఆ కార్యక్రమం నుంచి స్థానిక పోలీసులు బలవంతంగా లాగేసారు. ఈ క్రమంలో ఫోటోలు తీస్తున్న విలేకరులపై సారపాకకు చెందిన రౌడీ షీటర్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ సారపాక పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి దౌర్జన్యం చేశాడు. అది కాస్తా అధికార పార్టీ నాయకుల జోక్యంతో సద్దుమణిగింది. ఇలా అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వారికి అడ్డు వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తు వస్తున్నారు. ఇదే నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయిన విషయంలో ఆ వార్త విలేకరులను సైతం బెదిరించేందుకు పూనుకున్నారు. ఎవరికి లేనిది మీకేందుంకు అంటూ పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు.