యువకుడితో కలిసి యువతిపై సర్పంచ్ అత్యాచారం

by Nagaya |
యువకుడితో కలిసి యువతిపై సర్పంచ్ అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్ : అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చనే ధీమాలో ఉన్నారు కొందరు ప్రజాప్రతినిధులు. గ్రామానికి సేవ చేస్తాడని ఓట్లేసి గెలిపిస్తే.. పదవి రాగానే తమ పైత్యాన్ని ప్రదర్శించాడు ఓ సర్పంచ్. ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాల్సిన ఆయన వాటిని గాలికి వదిలేసి ఓ యువతిని గర్భావతిని చేశాడు. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బాధితులు శనివారం వెల్లబోసుకుంది.

వర్దన్నపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ అదే గ్రామానికి చెందిన యువతిని మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. ఆపై ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మరో యువకుడు కూడా ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చడంతో విషయం బయటకు పొక్కింది. అయితే తన గర్భానికి సర్పంచ్‌తోపాటు మరో యువకుడు కారణమని ఆ యువతి తెలిపింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలితో సహా కుటుంబం సభ్యులు ఆందోళనకు దిగారు. కాగా, విషయాన్ని గ్రామంలోనే చక్కదిద్దేందుకు బాధిత కుటుంబ సభ్యులతో గ్రామ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed