samyuktha: ఇది రియల్ పాన్ ఇండియన్ ఫిల్మ్.. యంగ్ హీరోయిన్ సినిమాపై హీరోయిన్ సంయుక్త కామెంట్స్

by sudharani |
samyuktha: ఇది రియల్ పాన్ ఇండియన్ ఫిల్మ్.. యంగ్ హీరోయిన్ సినిమాపై హీరోయిన్ సంయుక్త కామెంట్స్
X

దిశ, సినిమా: యువ చంద్ర కృష్ణ (Yuva Chandra Krishna), అనన్య నాగళ్ల (Ananya Nagalla) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘పొట్టేల్’ (Pottel) . సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్‌డేట్స్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రాగా.. ప్రమోషనల్ కంటెంట్‌తో 'పొట్టేల్' (Pottel) పై స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది హీరోయిన్ సంయుక్త (samyuktha).

ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త (samyuktha) మాట్లాడుతూ.. ‘అందరికి నమస్కారం. ఐ లవ్ ద ట్రైలర్. మంచి కంటెంట్ ఎవరు చేసినా నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ సాహిత్ ఒక స్టోరీ మీద ఫోర్ ఇయర్స్ వర్క్ చేయడం మామూలు విషయం కాదు. ఇంత అద్భుతమైన క్వాలిటీలో స్క్రీన్ మీద తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి రైటింగ్, డైరెక్షన్ ఉంటనే ఇంత అద్భుతమైన సినిమా తెరపైకి వస్తుంది. ఈ ట్రైలర్‌లో ఫస్ట్ షాట్ చూసినప్పుడు ఒక రియల్ పాన్ ఇండియన్ ఫిల్మ్ (Pan Indian Film) అనిపించింది. చాలా అథెంటిక్‌గా ఉంది. ఇంత మంచి ఎఫర్ట్‌తో ఈ సినిమాని తీసిన యూనిట్ అందరికీ అభినందనలు. ట్రైలర్ చాలా అద్భుతంగా వచ్చింది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్' అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story