Salman Khan: వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్..

by Manoj |   ( Updated:2023-06-13 14:57:47.0  )
Salman Khan breaks down in tears at the stage of iifa awards
X

దిశ,సినిమా: Salman Khan breaks down in tears at the stage of iifa awards| సూపర్‌ స్టార్ సల్మాన్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నాడు. ఐఫా అవార్డ్స్‌ ఈవెంట్‌లో కెరియర్ తొలినాళ్లను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు. 'మైనే ప్యార్ కియా' సినిమా సూపర్ హిట్ అయినా సరే తర్వాత ఆఫర్లు రాలేదని, అప్పుడు డైరెక్టర్ రమేష్ తనకు ఆఫర్ ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్న సల్లూ భాయ్.. నా కెరీర్ ముగిసిపోతుందనే టైమ్‌లో వాంటెడ్ చిత్రాన్ని నిర్మించి నిలబెట్టాడన్నాడు. ఇక సునీల్ శెట్టి, అనిల్ కపూర్ పేర్లను సైతం ప్రస్తావించిన సల్మాన్.. ఇంతగా ఎమోషనల్ అవడం ఇదే మొదటిసారి అంటున్నారు అభిమానులు.

Advertisement

Next Story

Most Viewed