- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sajjanar: ‘ఒకే ఒక్క ఛాన్స్..’ కీరవాణికి సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్!

దిశ, వెబ్‌డెస్క్: సినీగేయ రచయిత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ఆర్టీసీ ఎండీ సంజ్జనార్ ‘ఒక్క ఛాన్స్’ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ ఛాన్స్ తనకోసం కాదు. ఓ కుర్రాడి కోసం. అసలు విషయం ఏంటంటే.. అంధుడైన ఓ యువకుడు ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ శ్రీ ఆంజనేయం సినిమాలోని 'రామ రామ రఘురామ' అనే పాటను పాడాడు. అద్భుతమైన గొంతుతో ఆ పాటను పాడడమే కాకుండా కాళ్లతో పాటకు తగ్గట్లు మ్యూజిక్ చేస్తూ బస్సులోని ప్రయాణికులందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఇక దీనికి సంబంధించిన వీడియోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు ఆ యువకుడి ట్యాలెంట్‌ని మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి టైంలో ఈ వీడియోను చూసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో అడుగు ముందుకేసి ఎక్స్ వేదికగా ఎంఎం కీరవాణిని ట్యాగ్ చేస్తూ ఈ కుర్రాడికి ‘ఓ అవకాశం ఇవ్వండి సర్’ అంటూ ఈ కుర్రాడి వీడియోను కూడా షేర్ చేశారు.
‘‘మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా.. ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్’’ అని సజ్జనార్ రాసుకురావడంతో.. ఇప్పుడు ఈ పోస్ట్ మరింత వైరల్ అవుతోంది. మరి దీనిపై కీరవాణి ఎలా స్పందిస్తారో చూడాలి.