- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా దళాలు
దిశ, వెబ్ డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజురోజుకు తారా స్థాయికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే రష్యా మిలటరీ దళాలు ఉక్రెయిన్ వాయు ధళాన్నీ టార్గెట్ చేసుకుని దాడులు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం అయిన ఉక్రెయిన్ కు చెందిన ఫ్లాగ్ మ్యాన్ ఎయిర్ క్రాఫ్ట్ An-225 ను రష్యా బలగాలు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ స్టేట్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. కైవ్ ప్రాంతంలో ఉన్న హోస్టోమెల్ విమానాశ్రయంపై రష్యా దళాలు చేసిన దాడిలో కార్గో విమానం ధ్వంసం అయింది.
దానిని బాగు చేయడానికి సుమారు. USD 3 బిలియన్లకు పైగా ఖర్చుతో పాటు చాలా సమయం పడుతుందని ఉక్రో బోరాన్ ప్రోమ్ వారు తెలిపారు. ఈ విమానాన్ని(An-225 Mriya) 1980 లో రూపొందించారు. ఇది ప్రపంచంలోనే ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత పొడవైన, బరువైన విమానం. ఇది 640 టన్నుల వరకు సరుకును మోసుకెళ్లగలదు. ఉక్రేనియన్ ఏరోనాటిక్స్ కంపెనీ ఆంటోనోవ్ చేత ఈ భారీ విమానం తయారు చేయబడింది.