- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల కోసం ఆర్టీసీ బంపర్ ఆఫర్
దిశ, తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. గతంలో పిల్లల దినోత్సవం రోజు పిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం అందించిన ఆర్టీసీ.. తాజాగా మహిళలకు సైతం ఫ్రీగా బస్ జర్నీ చేసే అవకాశం ఇచ్చింది. మార్చి 8న (మంగళవారం) మహిళా దినోత్సవం సందర్భంగా 60 ఏళ్లు పైబడిన మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. 60 ఏళ్లు పైబడిన మహిళలందరూ వారి ఐడీ కార్డులతో ప్రయాణం చేయాలని సూచించింది. అదే విధంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో గర్భిణులు, పాలిచ్చే తల్లుల కొరకు రెండేసి సీట్లు కేటాయిస్తూ టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
దీనితో పాటుగా హైదరాబాద్ జంట నగరాల్లో ట్రావెల్యూజ్ టికెట్ ధరను రూ. 100 నుంచి రూ. 80కి తగ్గించారు. మహిళల కోసం ఈ ఆఫర్ ఈ నెల 8 నుంచి 14 వరకు వర్తింపచేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా వరంగల్, హన్మకొండ జంట నగరాల్లో కూడా ట్రావెల్ యూజ్ టికెట్‌ను రూ. 80 నుంచి రూ. 50కి తగ్గించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.