- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదపు అంచున బాసర ట్రిపుల్ ఐటీ.. దానికి కారణం ఆయనే: RS ప్రవీణ్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి తలమానికమైన ఏకైక రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ) విద్యా వ్యవస్థ పతనావస్థకు చేరిందని బీఎస్‌పీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 2008లో ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 169 మంది రెగ్యులర్ ప్రొఫెసర్స్ ఉండాల్సిన చోట కేవలం 19 మందితో బోధన కొనసాగుతోందన్నారు. కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీలతో బోధన అధ్వాన్నంగా తయారైందని, సకాలంలో సిలబస్ పూర్తి కావడంలేదని, సమయానికి ల్యాబ్‌ల నిర్వహణ లేదన్నారు. కేవలం సెమిస్టర్ పరీక్షల ముందు హడావుడిగా గెస్ట్ ఫ్యాకల్టీలతో సిలబస్‌ను పూర్తి చేయిస్తున్నారని వివరించారు. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలిపారు. బాసర ఐఐఐటీలో స్థితిగతులు అథమ స్థాయికి దిగజారిపోవడానికి ప్రధాన కారణం విద్యార్థులపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపడమేనని అన్నారు.
ఈ ప్రభుత్వం బడ్జెట్‌లో అరకోరగా నిధులు కేటాయించి విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కులపతి, ఉపకులపతిలను నియమించాలని డిమాండ్ చేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య, పరిశోధనలకు ప్రోత్సాహం అందించాలని, నాణ్యమైన భోజనం, వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. బాసర ఐఐఐటీ బిడ్డల తల్లిదండ్రులను కమాండోలను పెట్టి గేటు బయటకు నెట్టారని, రాత్రి వాళ్లు ఊరిలోని సత్రాల్లో జాగారం చేసి తనను కలిసినట్లు తెలిపారు. ఎందుకు కేసీఆర్ ప్రభుత్వానికి విద్యార్థులన్నా, వాళ్ల తల్లిదండ్రులన్నా అంత కక్ష? అని ప్రశ్నించారు. బాసర సమస్యలను పరిష్కరించాలేకపోతే అర్జెంటుగా సీఎం గద్దె దిగాలన్నారు.