ఘోర ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు.. 12 మంది మృతి

by samatah |
ఘోర ప్రమాదం.. నదిలో పడిపోయిన బస్సు.. 12 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ధార్ జిల్లాలో సోమవారం ఉదయం ఖాల్ ఘాట్ వద్ద బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 5 గురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగితా వారికోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇండోర్ నుంచి పుణే వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కాగా, ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు రెస్కూ టీం.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Next Story