గర్భిణీలకు థాలేట్స్ ముప్పు.. ముందస్తు డెలివరీ ప్రమాదం!

by Nagaya |
గర్భిణీలకు థాలేట్స్ ముప్పు.. ముందస్తు డెలివరీ ప్రమాదం!
X

దిశ, ఫీచర్స్ : గర్భిణీ స్త్రీలు థాలేట్స్ అనే రసాయన పదార్థాలకు ఎక్స్‌పోజ్ అయితే నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఇండస్ట్రియల్ కెమికల్స్, కాస్మోటిక్ ప్రొడక్స్, నెయిల్ పాలిష్, డిటర్జెంట్స్, ఫుడ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌‌లో ఉండే థాలేట్స్.. తల్లి చర్మంలోకి సులభంగా ప్రవేశించగలవని పేర్కొన్నారు. తద్వారా హార్మోన్ స్థాయిలు పడిపోయి పిండం పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయని వివరించారు. అందుకే ఏ వస్తువైనా కొనేముందు వాటిపై లేబుల్స్‌ను పరిశీలించాలని సూచిస్తున్నారు.

6,045 మంది గర్భిణీ స్త్రీల డేటాను పరిశీలించిన రట్జర్స్ పరిశోధకులు.. ముందస్తు జననం అనేది తల్లి-బిడ్డ అధిగమించలేని సవాళ్లలో ఒకటి అని అభిప్రాయపడ్డారు. వాతావరణంలో రోజువారీ కెమికల్స్ అనేవి సమస్యలో భాగమని.. థాలేట్ ఎక్స్‌పోజర్‌ను 50 శాతం తగ్గించడం ద్వారా ముందస్తు జననాన్ని 12 శాతం తగ్గించవచ్చని పరిశోధకులు అంచనా వేశారు. అందువల్ల థాలేట్‌లను కలిగి లేని ప్రొడక్ట్స్ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని సూచించారు. తాజాగా ఇంట్లో వండిన ఆహారాన్ని తరచుగా తీసుకోవడం, ప్లాస్టిక్‌లో వచ్చే ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండటం, సువాసన లేని ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా తగ్గించవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed