Renu Desai: సెలైన్స్ ఎక్కుతున్న వీడియోను షేర్ చేసిన రేణు దేశాయ్.. ఆందోళనలో ఫ్యాన్స్

by Hamsa |
Renu Desai: సెలైన్స్ ఎక్కుతున్న వీడియోను షేర్ చేసిన రేణు దేశాయ్.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయ్(Renu Desai), పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి అకీరా నందన్(Akira Nandan), ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. పవన్ కళ్యాణ్ మాత్రం మరో పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి రేణు దేశాయ్(Renu Desai) పిల్లల బాధ్యత తీసుకుని వారి బాగోగులు చూసుకుంటుంది. అలాగే జంతువులకు సాయం చేస్తోంది. ఇటీవల ఆమె ఓ NGOను కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది.

ప్రజెంట్ జంతువులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఆమె సెలైన్స్ ఎక్కుతున్న వీడియోను షేర్ చేసింది. ‘‘ఆధునిక ఔషధం భౌతిక శరీరాన్ని సజీవంగా ఉంచుతుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. అయితే అవి ఎవరు ఎక్కించుకుంటున్నారో మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రేణు దేశాయ్‌(Renu Desai)కు ఎమైందో? అని ఆందోళన చెందుతున్నారు. ప్రజెంట్ ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story