- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FLASH: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఊరట లభించింది. ఇమ్రాన్ ఖాన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పాకిస్థాన్ స్పీకర్ తోసిపుచ్చారు. అవిశ్వాస తీర్మాణం వెనుక విదేశీ కుట్ర ఉందని స్పీకర్ ఆరోపించారు. అంతేగాక, ఈనెల 25 కి పాక్ అసెంబ్లీని వాయిదా వేశారు. కుట్ర జరుగుతోందనే కారణాన్ని చూపుతూ, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ తీర్మానాన్ని తిరస్కరించారు. ఈ అవిశ్వాస తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. దీంతో ప్రతిపక్షాలు సభలో రసాభాస సృష్టిస్తున్నాయి. అనంతరం ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను అభినందించారు. అంతేగాక, దేశంలో ముందస్తు ఎన్నికలు జరుగాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ అసెంబ్లీని రద్దు చేయాలని పాక్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీని కోరారు.