Ravi Shastri: అలా ఇప్పుడు చేస్తే అతడిపై లైఫ్ టైం బ్యాన్ పడేది: రవిశాస్త్రి

by Javid Pasha |   ( Updated:2022-04-11 12:14:11.0  )
Ravi Shastri: అలా ఇప్పుడు చేస్తే అతడిపై లైఫ్ టైం బ్యాన్ పడేది: రవిశాస్త్రి
X

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా భారత బౌలర్ తన జీవితంలో జరిగిన ఓ వింత సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. 2013 ఐపీఎల్ సమయంలో ఓ ఆటగాడు ఫుల్‌గా మద్యం తాగి తనను బిల్డింగ్ 15వ అంతస్తు నుంచి కిందికి వేలాడదీశాడని, జట్టు సభ్యులు తనను కాపాడారని చాహల్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం అందరినీ షాక్‌కు గురిచేసింది. దీనిపై ఇప్పటికే ఇండియా లెజెండ్ సెహ్వాగ్ మాట్లాడుతూ.. అతడి పేరు చెప్పమంటూ చాహల్‌ను అడిగాడు. అయితే తాజాగా దీనిపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా స్పందించాడు. దీనిని మనం తేలికగా తీసుకోకూడదని అన్నారు. 'ఇలాంటి దారుణ విషయాలను నేను మొదటి సారి వింటున్నాను. ఇది నవ్వుకునే విషయం అస్సలు కాదు' అన్నాడు.

'ఈ ఘటనలో ఎవరు ఉన్నారో నాకు తెలియదు. కానీ అతడు స్పృహలో లేడు. అదే నిజమైతే అది పెద్ద సమస్యే. ఇందులో ఓ ప్రాణం ప్రమాదంలో ఉంది. కొందరికి ఇది నవ్వుకునే విషయంలా అనిపించినా నాకు మాత్రం అలా అనిపించడం లేదు. ఇలాంటి పనులు చేసేటంత దారుణ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఇలా చేస్తే.. తప్పులు జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అలా చేసిన ఆటగాడిపై లైఫ్‌టైమ్ బ్యాాన్ పడేది. అంతేకాకుండా అతడిని రిహాబిలిటేషన్ సెంటర్ కుదిరినంత త్వరగా పంపించడం జరిగుండేది' అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఇలాంటివి ఏమైనా జరిగితే వెంటనే అందరికీ చెప్పాలని, ఇలాంటివి జరిగినప్పుడు అధికారులను కలవాల్సిన బాధ్యత మీకే ఉంటుందంటూ శాస్త్రి చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story