- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరిహద్దు దాటుతున్న రేషన్ బియ్యం
దిశ , జహీరాబాద్: తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో మరోసారి పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. బుధవారం అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న ఓ లారీని పోలీసులు తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో 249 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చిరాగ్ పల్లి పోలీసులు గుర్తించి, సీజ్ చేశారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులు లారీ డ్రైవర్ కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ తాలూకా రాజేశ్వర్ గ్రామానికి చెందిన జన్నత్ ఖాన్ (52), లారీ యజమాని హైదరాబాద్ కర్మన్ ఘాట్‌కు చెందిన ఎండి అన్వర్(25) లు ఉన్నారు.
ఎస్‌ఐ ఎం కాశీనాథ్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రహస్య సమాచారం మేరకు డీఎస్పీ జి.శంకర్ రాజు ఆదేశానుసారం సీఐ పి. రాజశేఖర్ పర్యవేక్షణలో బుధవారం చిరాక్ పల్లి ఎస్ఐ ఎం కాశీనాథ్, తన సిబ్బందితో కలిసి మాడ్గి శివారులోని ఆర్టీవో చెక్ పోస్ట్ సమీపంలో ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా జహీరాబాద్ వైపు నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న లారీ అనుమానాస్పదంగా ఉండటంతో దాన్ని ఆపి తనిఖీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న పిడిఎస్ బియ్యాన్ని దొంగచాటుగా రవాణా చేస్తూ..సరిహద్దులు దాటిస్తున్నారు. వాహనంలో సుమారు 632 ప్లాస్టిక్ బ్యాగుల్లో 249 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయన్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్న లారీ, బియ్యం ను స్వాధీనం చేసుకుని, యజమాని, లారీ డ్రైవర్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.