- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mayawati: రాష్ట్రపతిపై వ్యాఖ్యలు సిగ్గుచేటు
న్యూఢిల్లీ: Mayawati Calls Chowdhury's 'Rashtrapatni' Remarks Shameful| కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ రాష్ట్రపతిపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, వెంటనే కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తన కులతత్వ ఆలోచనను వీడాలని కోరారు. ఈ మేరకు ఆమె గురువారం ట్వీట్ చేశారు. 'గిరిజన సమాజం నుంచి భారత అత్యున్నత పదవికి తొలి మహిళగా ద్రౌపది ముర్ముజీ ఎన్నిక కావడం చాలా మందికి నచ్చలేదు. ఆమెపై లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్య చాలా విచారకరం, అవమానకరం, అత్యంత ఖండించదగినది' అని మాయావతి ట్వీట్‌లో పేర్కొన్నారు. కులతత్వ ఆలోచనను కలిగి ఉన్నందుకుగానూ కాంగ్రెస్ పార్టీ దేశానికి క్షమాపణలు చెప్పాలని కోరారు.
ఇది కూడా చదవండి: ప్రపంచలోనే అతిపెద్ద భారత జాతీయ జెండా
- Tags
- Mayawati