- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియాలో కనిపించిన అరుదైన తెల్ల కంగారూ..వెంటనే ఓ మహిళ..?!
దిశ, వెబ్‌డెస్క్ః ఆస్ట్రేలియా కంగారూలకు ప్రసిద్ధి. అలాగే, కంగారూలు ఎలా ఉంటాయో అందిరికే తెలుసు కూడా. కానీ, అందురూ చూసిన కంగారూల కాకుండా శరీరమంతా తెల్లగా ఉండే కంగారూలు మాత్రం అరుదైనవే. అలాంటి కంగారూ ఒకటి తాజాగా ఆస్ట్రేలియాలోని అవుట్‌బ్యాక్ క్వీన్స్‌లాండ్‌లో స్థానికులకు కనిపించింది. ఇలా తెల్లగా ఉండే కంగారుల్ని అల్బినో కంగారూ అని పిలుస్తారు. అరుదుగా కనిపించే ఇలాంటి కంగారు ఒకటి ఆరు నెలల క్రితం కూడా అక్కడే కనిపించిందంట. ఈ కంగారూను నోగో స్టేషన్ నివాసి సారా కిన్నన్ గుర్తించారు. "నేను నా భర్తతో కలిసి బయటికి వచ్చాను. మేము రామ్ గొర్రెలను తీసుకొస్తున్నాము. హఠాత్తుగా అక్కడ తెల్ల కంగారు ఉంది" అని ఆమె ఎబిసి న్యూస్‌తో అన్నారు. అయితే, అది చూడటానికి చాలా అద్భుతంగా ఉందనీ, ఒక తెల్లటి కాగితం ఎలా ఉంటుందో అది అంత తెల్లగా ఉందని, ఇలాంటి కంగారూని మొదటిసారి చూసి ఎంతో సంతోషపడ్డానని ఆమె తెలిపింది. అయితే, అది పరుగెత్తడానికి ముంరే సారా కిన్నన్ తన కెమెరాను క్లిక్ చేసింది. ఆనందంతో ఇంటర్నెట్‌లో పెట్టింది. దాన్ని చూసిన నెటిజన్లు అద్భుతమంటూ స్పందిస్తున్నారు.
ఇక, ఈ అల్బినో కంగారూలు ఏంటీ? ఎందుకలా తెల్లగా ఉంటాయంటే.. మనుషులకు బొల్లి రోగం వచ్చినట్లే కంగారూలకు కూడా అల్బినో బొల్లి సోకడం వల్ల వాటి శరీరమంతా తెల్లగా మారిపోతుంది. అయితే, ఇలాంటి అల్బినో కంగారూలు మాత్రం చాలా అరుదుగానే కనిపిస్తాయంటారు.