- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా చందమామ.. నా చిన్ని కన్నా అంటూ అతనికి విష్ చేసిన రంగమ్మత్త .. వైరల్ అవుతోన్న ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. నేడు సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగింది. అలా ఈ భామ ‘రంగ స్థలం’ సినిమాలో నటించి రంగమ్మత్త క్యారెక్టర్‌కు జీవం పోసింది. దీంతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన ‘పుష్ప’ మూవీలో దాక్షాయణిగా విలన్(సునిల్)కి భార్యగా నటించింది. ఈ మూవీతో ఈ భామకు ఎంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందో స్పెషల్‌గా చప్పనక్కర్లేదు. ప్రస్తుతం పుష్పకి సీక్వేల్‌లో వస్తున్న ‘పుష్ప 2’ లో కూడా అనసూయ నటిస్తోంది. అయితే ‘పుష్ప 2’ లో కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆధారంగా తెలుస్తోంది. అలాగే రీసెంట్‌గా జగపతి బాబు సరసన ‘సింబా’ అనే సినిమాలో కూడా నటించి అలరించింది.
అంతే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన చిన్న కొడుకుతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ బర్త్‌డే విష్ చేసింది. అలాగే ‘నా చిన్ని కన్నా.. నా చందమామ’ అంటూ పొగిడింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు, ఫ్యాన్స్ అనసూయ కొడుకుకి బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.