హీరోయిన్ కోసం కొట్టుకున్న మాజీ ప్రియులు.. నడిరోడ్డుపై పిడిగుద్దుల వర్షం

by Harish |
హీరోయిన్ కోసం కొట్టుకున్న మాజీ ప్రియులు.. నడిరోడ్డుపై పిడిగుద్దుల వర్షం
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి దీపికా పదుకొనే.. రణ్‌వీర్ సింగ్‌తో పెళ్లికి ముందు నిహార్ పాండ్యా, రణబీర్ కపూర్‌లను ప్రేమించిన సంగతి తెలిసిందే. అయితే దీపిక కోసం నిహార్-రణ్‌బీర్ నడిరోడ్డుపై గొడవ పెట్టుకోగా.. నిహార్‌పై రణ్‌బీర్ పిడిగుద్దుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అసలు విషయానికొస్తే.. ఓ సినిమా షూటింగ్‌ కోసం రణ్‌బీర్‌ ఊటీకి వెళ్లినప్పుడు దీపిక నిహార్‌తో లంచ్‌డేట్‌కి వెళ్లిందని, దాదాపు రెండు గంటల పాటు వీరి డేట్‌ జరిగిందనే విషయం రణ్‌బీర్‌కు తెలిసిందట. దీంతో వారిద్దరిని పట్టుకునేందుకు ప్లాన్ వేసిన ఆయన ఓ రోజు కలిసి వెళ్తున్నప్పుడు గొడవ చేశాడని సమాచారం. ఈ క్రమంలో నిహార్‌ను రణ్‌బీర్ చితక బాదాడని ఈ సంఘటనను సన్నిహితులు ఇటీవల బయటపెట్టారు. ఇక ఈ ఇష్యూ తర్వాత కత్రినతో డేటింగ్‌ చేసిన రణ్‌బీర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని దీపిక రివేంజ్ తీసుకుందని తెలుస్తోంది. ఫైనల్‌గా దీపిక రణ్‌వీర్ సింగ్‌ను, నిహార్‌ పాండ్యా సింగర్‌ నీతి మోహన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోగా.. రణ్‌బీర్ ఇంకా అలియాభట్‌తో డేటింగ్ చేస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed