- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెండు దిగ్గజ మల్టీప్లెక్స్ సంస్థల మధ్య విలీన చర్చలు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మల్టీప్లెక్స్ రంగంలో రెండు సంస్థల మధ్య అతిపెద్ద విలీనం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మల్టిప్లెక్స్ చెయిన్ సంస్థ పీవీఆర్, మెక్సికన్ కంపెనీ సినీ పోలిస్ ఇండియా మధ్య విలీనం కోసం చర్చలు ముగింపు దశలో ఉన్నట్లు సమాచారం. రెండు సంస్థలు కలిపి దేశవ్యాప్తంగా 1,200కి పైగా స్క్రీన్‌లను కలిగి ఉన్నాయి. విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో సినీ పోలిస్ 20 శాతంతో అతిపెద్ద వాటాదారుగా ఉండనుంది. పీవీఆర్ 10-14 శాతం మధ్య వాటాను కలిగి ఉండనుంది. చర్చలు విజయవంతంగా ముగిసి విలీన ప్రక్రియ పూర్తయితే ప్రస్తుతం పీవీఆర్‌కు సీఎండీగా ఉన్న అజయ్ బిజ్లీ మూడేళ్ల పాటు విలీన సంస్థ నిర్వహణ బాధ్యతలను తీసుకుంటారు. పీవీఆర్ సంస్థ దేశీయంగానే కాకుండా శ్రీలంకలోని 71 నగరాల్లో 176 సినిమా హాళ్లతో మొత్తం 1,82,000 సిటింగ్ సామర్థ్యంతో 846 స్క్రీన్‌లను కలిగి ఉంది. సినీ పోలిస్ భారత్‌లోని 22 రాష్ట్రాల్లో 417 స్క్రీన్‌లను కలిగి ఉంది. దీంతో విలీనం అనంతరం మొత్తం 1,263 స్క్రీన్‌లతో దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ నిలవనుంది. మరో మల్టీప్లెక్స్ సంస్థ ఐనాక్స్ 72 నగరాల్లో 160 మల్టీప్లెక్స్‌లు, 675 స్క్రీన్‌లను నిర్వహిస్తోంది.