'ది కశ్మీరీ ఫైల్స్' యూట్యూబ్‌లో విడుదల చేయాలి.. సీఎం

by Vinod kumar |
ది కశ్మీరీ ఫైల్స్ యూట్యూబ్‌లో విడుదల చేయాలి.. సీఎం
X

న్యూఢిల్లీ: సంచలనంగా మారిన 'ది కశ్మీరీ ఫైల్స్' చిత్రం పన్ను మినహాయింపు చేయాలన్న విజ్ఞప్తిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. చిత్రదర్శకులు వివేక్ అగ్నిహోత్రి సినిమాను యూట్యూబ్‌లో విడుదల చేయాలని ఆయన సూచించారు. క్రితం రోజు ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్స్‌కు అడ్డు తగిలిన సంగతి తెలిసిందే. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని పన్ను రహితంగా రాష్ట్రంలో అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. 'ప్రతి ఒక్కరూ సినిమాను చూడాలని దర్శకుడు అగ్నిహోత్రి అనుకుంటే, ఆయన యూట్యూబ్ లో విడుదల చేయాలి. అలా అయితే అందరికీ సినిమా అందుబాటులో ఉంటుంది' అని అన్నారు. 'నేడు ప్రతి చోట బీజేపీ ఈ సినిమా పోస్టర్లను అంటిస్తుంది. మీరు రాజకీయాల్లోకి ఇందుకే వచ్చారా?' అని ఆయన ప్రశ్నించారు. కాగా, ఈ సినిమాను ఉత్తరప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, ఛంఢీగఢ్, హిమచల్ ప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed