Bhagwant Mann: కలుషిత నీరు తాగడం తో పంజాబ్ సీఎంకు అస్వస్థత

by Satheesh |   ( Updated:2022-08-11 07:52:27.0  )
Punjab CM Bhagwant Mann Hospitalized at Delhi Apollo
X

న్యూఢిల్లీ: Punjab CM Bhagwant Mann Hospitalized at Delhi Apollo| పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి కడుపునొప్పి రావడంతో న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఈ మేరకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అయితే భగవంత్ సింగ్ మాన్‌కు అనారోగ్యం బారిన పడటంపై తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆమ్ ఆద్మీ పంజాబ్ ట్విట్ చేసిన ఈ వీడియోలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కలుషితమైన నీరు తాగుతున్నట్లు కనిపిస్తుంది. గత ఆదివారం పర్యావరణవేత్త, రాజ్యసభ ఎంపీ బాబా బల్బీర్ సింగ్ సీచెవాల్.. కలిబీన్‌ నది 22వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎం భగవంత్ మాన్ హాజరయ్యారు. ఈ క్రమంలో సుల్తాన్‌పూర్ లోధిలోని పవిత్ర నది నీటిని నిస్సంకోచంగా తాగారు. కలుషిత నీరు తాగడంతో భగవంత్ మాన్‌కు కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. కాగా, పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులోని నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనిపై భగవంత్ మాన్ స్పందిస్తూ.. రాష్ట్ర పోలీసులు, గ్యాంగ్‌స్టర్ నిరోధక టాస్క్‌ఫోర్స్‌కు అభినందించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు ఇద్దరిని హతమార్చారు. మృతులు జగ్‌రూప్‌ సింగ్ రూపా, మన్‌ప్రీత్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చాలని బీజేపీ ప్రయత్నం : సీఎం మమతా బెనర్జీ

Advertisement

Next Story

Most Viewed