- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరు పెట్టడానికి రూ.7 లక్షలు..! కిర్రాక్ బేబీనేమ్ కన్సల్టెంట్
దిశ, వెబ్‌డెస్క్ః పిల్లలు పుడితే ఎంత సంతోషిస్తారో వాళ్లకి పేరు పెట్టడానికి అంత కష్టపడతారు తల్లిదండ్రులు. అయినా ఫర్వాలేదు, ఇప్పుడు మార్కెట్ దేన్నైనా ప్రొవైడ్ చేయగల్గుతుంది. మన తిండి, మన నిద్ర, ఇంకా ఒకటి, రెండు తప్ప మిగిలిన అన్ని పనుల్లో సాయం చేయడానికి కన్సల్టెంట్‌లు రెడీగా ఉంటారు. ఈ క్రమంలోనే పుట్టిన, పుట్టబోయే బిడ్డలకు పేరు పెట్టడానికి కూడా ప్రొఫెషనల్ నేమర్లు ఉన్నారు. మిగతా వారేమో కానీ, ఈ ప్రొఫెషనల్ బేబీ నేమర్ మాత్రం చాలా కాస్ట్లీ మరి! ఒక్క పేరుకి లక్షన్నర నుండి ఏడున్నర లక్షల వరకూ తీసుకుంటుంది. అవాక్కయినప్పటికీ ఇది నిజం మరి!
న్యూయార్క్‌కు చెందిన 'ప్రొఫెషనల్ బేబీ నేమర్', టేలర్ ఎ. హంఫ్రీ, తల్లిదండ్రులకకు ఇష్టమయ్యే అద్భుతమై పేరు పెట్టడానికి 1,500 డాలర్ల (రూ. 1.14 లక్షలు) నుండి 10,000 డాలర్ల (రూ. 7.6 లక్షలు) వరకూ చార్జ్ చేస్తుంది. 33 ఏళ్ల హంఫ్రీ గతేడాది 100 మందికి పైగా పిల్లలకు పేర్లు పెట్టింది. తక్కువ-శ్రేణి 1,500 డాలర్ల సేవలో కుటుంబంలోని పూర్వుల పేర్లను వెలికితీసి, వాటి ఆధారంగా పేరును సజస్ట్ చేస్తుంది. ఇక, హై-గ్రేడ్ 10,000 డాలర్ల పేరు అనేది తల్లిదండ్రుల వ్యాపారంలో బ్రాండ్‌గా పెట్టుకోదగిన పేరును ఎంచుకోవడం అనమాట! హంఫ్రీ తన ప్రయాణాన్ని 2015లో ప్రారంభించింది. తనకు ఇష్టమైన పిల్లల పేర్లను, వాటి అర్థాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో మొదలైన ఆమె ప్రయాణం ప్రొఫెషనల్ నేమర్‌గా ఎదిగింది. ఇలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు మంచి ఫాలోయింగ్ పెరిగింది. చాలా మంది ఫాలోవర్స్ ఆమెను పేర్ల కోసం సలహా అడగడం ప్రారంభించడంతో మొదట సరదాగా తీసుకున్న ఆమె తర్వాత దాన్నే ప్రొఫెషన్‌గా మర్చేసుకుంది.