- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యం వికటించి గర్భిణి మృతి.. డిప్రెషన్‌లో డాక్టర్ ఏం చేసిందంటే..
దిశ, వెబ్ డెస్క్: గర్భిణి మహిళ మృతికి కారణమైన వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం లోని దౌసా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌసా జిల్లాలోని ఓ ప్రైవేటు ఫెసిలిటీ సెంటర్ కు చికిత్స నిమిత్తం వచ్చిన గర్భిణీ వైద్యం వికటించి మరణించింది. దీంతో మృతురాలి భర్త డాక్టర్ అర్చన శర్మ పై కేసు నమోదు చేశారు. అలాగే గర్భిణీ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
గర్భిణి మృతికి కారణమైన వైద్యురాలిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో లాల్సోట్ పోలీస్ స్టేషన్‌లో డాక్టర్ అర్చనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో డిప్రెషన్‌కు గురై అదే రోజు మధ్యాహ్నం ఆసుపత్రి పై ఉన్న తన నివాసంలో డాక్టర్ అర్చన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అదనపు ఎస్పీ లాల్ చంద్ కయల్ తెలిపారు. అలాగే ఈ సంఘటన పై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.