- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Post Office FD Interest Rates: పోస్టాఫీసులో FD ల పై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి
దిశ, వెబ్‌డెస్క్: Post Office FD Interest Rates| పోస్టాఫీసు భారతీయ ప్రజలకు ఎప్పటినుంచో చిన్న మొత్తాల నుంచి మొదలుకొని పెద్ద మొత్తాల వరకు పెట్టుబడులపై నమ్మకమైన అధిక రాబడి ఇస్తోంది. బ్యాంకులతో పోటీ పడటానికి అధిక వడ్డీ రేట్లను ప్రజలకు ఆఫర్ చేస్తుంది. మధ్య తరగతి ప్రజలకు, పేదవారికి ఉపయోగపడే విధంగా చిన్న మొత్తాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని పోస్టాఫీసు ఇస్తొంది. ఈ మధ్యకాలంలో FDలో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. లాభదాయకమైన, సురక్షితమైన పెట్టుబడి కారణంగా ప్రజలు పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పోస్టాఫీసులో డబ్బులను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికి మొదటగా ఖాతా ఓపెన్ చేయాలి.
పోస్టాఫీసులో 60 సంవత్సరాల లోపు వారికి ఒక వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు(60 సంవత్సరాలు పైబడిన వారు) మరొక వడ్డీరేటు ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
పోస్టాఫీసు వడ్డీ రేట్లు ఒకసారి చూద్దాం..
* 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల FD పై వడ్డీ రేటు 5.5 శాతం.
* 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు వడ్డీ రేటు 6.7 శాతం
రూ. 50,000 లు 3 సంవత్సరాలకు 5.5 శాతం వడ్డీతో రూ. 58,712 అవుతుంది.
రూ. 2లక్షలు 3 సంవత్సరాలకు 6.7 శాతం వడ్డీతో రూ. 2,42,954 అవుతుంది.
సీనియర్ సిటిజన్స్
* 1 నుంచి 5 సంవత్సరాల FD పై వడ్డీ రేటు 7.4 శాతం. గరిష్ట మొత్తం రూ. 15 లక్షలు. వడ్డీని మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై పన్ను మినహాయింపు లభిస్తుంది.
60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు, రిటైర్డ్ గవర్నమెంట్ సిబ్బందికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది.
* రూ. 2లక్షలు, 5 సంవత్సరాలు 7.4శాతం వడ్డీతో రూ. 2,85,793 అవుతుంది.
* రూ. 5లక్షలు, 5 సంవత్సరాలు 7.4శాతం వడ్డీతో రూ.7,14,482 అవుతుంది.
మరిన్ని వార్తలు: