పేకాట స్థావరంపై పోలీసుల ఉక్కుపాదం.. 8 మంది అరెస్ట్

by Mahesh |
పేకాట స్థావరంపై పోలీసుల ఉక్కుపాదం.. 8 మంది అరెస్ట్
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని విప్పలసింగారం ప్రాంతంలో పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని విప్పల సింగారం ప్రాంతంలో పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.పేకాట ఆడుతున్న వ్యక్తులు కారం నాగేశ్వరరావు, పాయం నాగరాజు,చల్ల జగదీష్,ఎస్.కె మహమ్మద్, కట్టం నరేష్,కుంజా రాంబాబు, ఎం.డి అన్వర్ పాషా,గుండు ఉజ్వల్ కార్తీక్ లని పోలీసులు తెలిపారు. వీరి దగ్గర నుంచి 3,490 నగదు,2 ద్విచక్ర వాహనాలు, 8 సెల్ ఫోన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story