- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్ సేవల రంగ కార్యకలాపాల్లో వేగవంతమైన వృద్ధి!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది జూన్‌లో భారత సేవల రంగ కార్యకలాపాలు పదకొండేళ్లలోనే బలమైన వృద్ధిని సాధించింది. డిమాండ్ పరిస్థితులు మెరుగుపడటం, కొత్త వ్యాపారాల వృద్ధి, ఔట్‌పుట్ పుంజుకోవడం ఈ స్థాయి వృద్ధి నమోదైంది. ఎస్అండ్‌పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ సూచీ జూన్ నెలలో 59.2 పాయింట్లకు పెరిగింది. అంతకుముందు మేలో 58.9 పాయింట్లుగా నమోదైంది. పీఎంఐ సూచీ 50 పాయింట్లు దిగువన ఉంటే క్షీణతగానూ, ఆపైన నమోదైన వృద్ధిగానూ పరిగణిస్తారనే విషయం తెలిసిందే.
ముఖ్యంగా కొత్త పనులకు గిరాకీ పుంజుకోవడం కలిసొచ్చింది. దీంతో వరుసగా పదకొండవ నెల సేవల రంగం వృద్ధిని సాధించింది. రానున్న ఏడాది పాటు సేవల రంగం రికవరీ కొనసాగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో ధరల ఒత్తిడి కారణంగా వ్యాపార విశ్వాసం నెమ్మదించడం, ఇన్‌పుట్ ఖర్చులు అత్యధికంగా ఉండటం పట్ల కంపెనీలు దృష్టి సారించాయి. దేశవ్యాప్తంగా అధికంగా ఉన్న ద్రవ్యోల్బణం వల్ల వ్యాపార కార్యకలాపాలు గతేడాది స్థాయిలోనే ఉండటం పట్ల కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 9 శాతం కంపెనీలు మాత్రమే రానున్న నెలల్లో వృద్ధి సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నాయి. 2011, ఫిబ్రవరి తర్వాత సేవల రంగంలో డిమాండ్ గణనీయంగా మెరుగుపడింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రంగం బలమైన ఆర్థిక పునరుద్ధరణ సాధిస్తోందని ఎస్అండ్‌పీ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా వెల్లడించారు.